హైదరాబాద్: 28°C
వార్తలు

చేర్యాలలో 'తిరంగా యాత్ర' సన్నాహకం

SDPT: హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ చేర్యాల మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ పిలుపునిచ్చారు. చేర్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి బల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ఈ నెల 12న చేర్యాలలో జరిగే తిరంగా యాత్రలో యువత భారీగా పాల్గొనాలని కోరారు.