వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆదివారం సెలవు రోజున తరగతులు నిర్వహిస్తున్నారని తెలంగాణ సేన విద్యార్థి విభాగం (TRSV) ఆరోపించింది. సెలవు దినాల్లో విద్యార్థులను పాఠశాలకు పిలవడం సరికాదని జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సెలవులను యాజమాన్యాలు గౌరవించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఆదివారం తరగతులపై ఆగ్రహం


