హైదరాబాద్: 28°C
వార్తలు

కనకదుర్గ అమ్మవారికి కోట నీలిమ పూజలు

HYD: ఆషాఢ బోనాల సందర్భంగా అమీర్‌పేట్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ కోట నీలిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు, పూజారులు ఆమెకు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.