GNTR: తెనాలి పట్టణ పరిధిలోని గాంధీ పార్క్ ఓల్డ్ ట్యాంక్ వద్ద ఎంఎస్ పైప్‌లైన్ ఇంటర్‌కనెక్షన్ పనుల కారణంగా సోమవారం సాయంత్రం మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. 4, 7, 8, 9, 10, 11, 12, 16 వార్డులకు ఈ అంతరాయం ఉంటుందని, అయితే రేపు ఉదయం యథావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
వార్తలు
రేపు మంచినీటి సరఫరా నిలిపివేత


