హైదరాబాద్: 28°C
వార్తలు

అవయవ, శరీర దానంపై విద్యార్థులకు అవగాహన

 BHPL: ఆదర్శ పాఠశాలలో అవయవ, శరీర దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఛైర్మన్‌ దేవునూరి చంద్రమౌళి మాట్లాడుతూ.. అవయవ దానం ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అన్నారు. శరీర దానం వైద్య విద్య, పరిశోధనలకు దోహదపడుతుందని తెలిపారు. శరీర దానానికి అంగీకరించిన జనగామ కరుణాకర్‌రావు, ఎలుబాక సుజాతను సన్మానించారు.