ప్రకాశం: సంతమాగులూరు, బల్లికురవ ప్రాంతాలలో ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల రాగి వైర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు మీడియా సమావేశంలో చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నారు.
వార్తలు
ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు అరెస్ట్


