హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వర్షం కోసం పోలేరమ్మకు పొంగళ్ళు

ప్రకాశం: మర్రిపూడి (మం) తంగెళ్లలో వర్షం కోసం పోలేరమ్మకు ఆదివారం మొక్కులు చెల్లించారు. వర్షం లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ దాటిపోతుందని గ్రామస్తులు పోలేరమ్మ తల్లికి సద్ది పెట్టి అమ్మవారికి కొలుపులు నిర్వహించారు. గ్రామస్తులంతా వర్షం కోసం పూజలు నిర్వహించి డప్పులు నృత్యాలతో గ్రామంలో పొంగళ్లతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పొంగళ్ళు నైవేద్యం పెట్టారు.