అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మరణించారు. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో ఎదురుగా వేగంగా వచ్చిన ఓ పికప్ ట్రక్కు దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. దిలీప్ స్వస్థలం కడప జిల్లా చిట్వేల్ మండలం జెట్టివారిపాలెం. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అతను కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు.
వార్తలు
ఒహాయోలో రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసి మృతి


