హైదరాబాద్: 28°C
వార్తలు

అలంపూర్‌లో వర్షాభావంతో పంటల సాగు మందగింపు

GDWL: అలంపూర్ మండలంలో సరైన వర్షాలు లేక సాగు విస్తీర్ణం నెమ్మదిగా పెరుగుతోంది. జులైలో సాధారణ వర్షపాతం 122.3 మి.మీ. ఉండాల్సి ఉండగా 52 మి.మీ. మాత్రమే నమోదైంది. వర్షాలు తక్కువగా ఉండటంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కోనేరు, బుక్కాపూర్ తదితర గ్రామాల్లో 1,780 ఎకరాల్లో పత్తి సాగవుతోంది.