హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

BHPL: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహదేవపూర్ ఐటీడీఏ కార్యాలయ సముదాయంలోని కొమురం భీమ్ విగ్రహానికి అధికారులు, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదివాసీలు ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలని అధికారులు సూచించారు.