హైదరాబాద్: 28°C
వార్తలు

కాంట్రాక్ట్ సిబ్బందికి తిరిగి ఉద్యోగాలు

VSP: ఉక్కునగరం విమల విద్యాలయంలో గత 17 ఏళ్లుగా పనిచేసిన 8 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చొరవతో డీఈఓ ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడి అధికారులు వారికి తిరిగి అవకాశం కల్పించారని తెలిపారు.