హైదరాబాద్: 28°C
వార్తలు

చీఫ్ గెస్ట్‌గా సీజేఐని పిలవద్దు: విద్యార్థులు

సీజేఐ సూర్యకాంత్‌ను తమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించటంపై నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీట్ నిరసనలపై విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనను పిలవవద్దని కోరుతూ దాదాపు 450 మందికి పైగా విద్యార్థులు యాజమాన్యానికి లేఖ రాశారు. తమ డిమాండ్ పట్టించుకోకపోతే నిరసన చేపట్టే విషయాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు.