హైదరాబాద్: 28°C
వార్తలు

నా కూతురుతో పాటు 25 మందిని: బీజేపీ ఎమ్మెల్యే

తన అల్లుడిపై యూపీ సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారినని 2024లో తన కుమార్తె ప్రజ్ఞను ప్రఖార్ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. వివాహం తర్వాత అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించగా అతడు వేర్వేరు పేర్లు, నకిలీ గుర్తింపు కార్డులతో 25 మందిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.