హైదరాబాద్: 28°C
వార్తలు

మదనపల్లి తాలూకా ఎస్సైగా విష్ణు నారాయణ

అన్నమయ్య: మదనపల్లి తాలూకా పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా విష్ణు నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై చంద్రమోహన్ సదుం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ఎస్సై విష్ణు నారాయణ సూచించారు.