హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సరిసబ్ గ్రామంలో వేగంగా వచ్చిన SUV వాహనం అదుపుతప్పి ముగ్గురు మహిళల పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులు రీటా దేవి, కిరణ్ దేవి, ఫూల్‌దై దేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి అనంతరం ఘటనపై కేసు నమోదు చేశారు.