హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆధ్యాత్మికతతో సమాజ శాంతి'

NTR: ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని అన్నారు. నందిగామ పట్టణంలోని శ్రీ సత్యసాయి మందిరంలో జరిగిన ఆషాఢ మాస సారె కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.