హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాలి'

WNP: డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ డిమాండ్ చేశారు. వనపర్తిలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏడాది పనిచేసినా వేతనాలు సక్రమంగా అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.