హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

CTR: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. బంగారుపాళ్యెం మండలంలోని కాట్టప్పగారి పల్లె, కల్లూరు తదితర గ్రామాలలో ఆదివారం నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను పంచిపెట్టారు.