హైదరాబాద్: 28°C
వార్తలు

KTR జల ఉద్యమంపై చామల విమర్శలు

TG: KTR జల ఉద్యమంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు BRSను జల సమాధి చేశారని, KCR గతంలో జగన్‌కు బిర్యానీ పెట్టి గోదావరి జలాలు ఇస్తామన్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తూ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని BRS చూస్తోందన్నారు. కేసీఆర్ రోజా ఇంట్లో చేపల పులుసు తిని.. రాయలసీమను రథనాల సీమ చేస్తానని అనలేదా? అని ప్రశ్నించారు.