హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. క్యూలైన్లలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ త్వరగా దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.