హైదరాబాద్: 28°C
వార్తలు

పేపర్ మిల్లుని సందర్శించిన ఆక్స్ఫర్డ్ విద్యార్థులు

SKLM: నగరంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు నరసన్నపేట సమీపంలోని మండపం పేపర్ మిల్లును ఆదివారం సందర్శించారు. సుమారు రెండు గంటల పాటు పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలించి, వ్యర్థాల నుంచి కాగితం తయారయ్యే ప్రక్రియను, దాని వెనుక ఉన్న శ్రమను విద్యార్థులు దగ్గరగా గమనించారు. ఈ సందర్శన తమకు మంచి అనుభూతిని, అనుభవాన్ని అందించిందని విద్యార్థులు తెలిపారు.