హైదరాబాద్: 28°C
వార్తలు

జీహెచ్‌ఎంసీకి అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

TG: హైదరాబాద్ నగరంలో బోనాలు పండగ సందర్భంగా ఇవాళ, రేపు బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోవడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రేపు సర్ గడువు ముగుస్తుండటంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలు గడువులోపు తీసుకునేలా బీఎల్‌ఓలను ఆదేశించాలని ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు.