హైదరాబాద్: 28°C
వార్తలు

కౌలు రైతు రూ.82 లక్షల ఐపీతో పరారీ!

NDL: గడివేములకు చెందిన కౌలు రైతు బాల హుస్సేని రూ.82.36 లక్షలకు ఐపీ పెట్టి పరారైనట్లు బాధితులు తెలిపారు. గ్రామంలో పలువురి వద్ద 90 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని మిరప తదితర పంటలు సాగు చేశాడు. పంటలు దెబ్బతినడంతో అప్పులు, వడ్డీలు చెల్లించలేక చివరకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.