ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరమ్మ తల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆషాడ మాసం పురస్కరించుకుని అమ్మవారికి రకరకాల కూరగాయలతో 'శాఖాంబరి'గా దివ్య సుందరంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు
VIDEO: వల్లూరమ్మ గుడిలో శాకంబరి ఉత్సవాలు


