హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆదివాసీల హక్కులను పరిరక్షించుకోవాలి'

KMR: ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆదివాసీ నాయకపోడ్ కులస్తులు రవీందర్, రాములు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్దూంపూర్ మరియు గాలిపూర్ గ్రామాల్లో ఆదివాసీ నాయకపోడ్ కులస్తుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముక్దూంపూర్ గ్రామ సర్పంచ్ సుమయ అతిక్, నారాయణ ఉన్నారు.