హైదరాబాద్: 28°C
వార్తలు

డిజిటల్ లైబ్రరీ హామీపై పాఠకుల ఎదురుచూపులు

JN: స్టేషన్ ఘనపూర్‌లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడి ప్రమాణస్వీకార సభలో ఏడాదిలోపు లైబ్రరీ నిర్మిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించాలన్నారు.