GDWL: మల్దకల్ మండలం దాసరిపల్లి-బురెడ్డిపల్లె గ్రామాల మధ్య రోడ్డు దశాబ్దకాలంగా అధ్వానంగా మారింది. బురదమయంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రాత్రివేళలో ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వార్తలు
బురదమయంగా దాసరిపల్లి-బురెడ్డిపల్లె రోడ్డు


