WNP: అత్మకూరు మండలం జూరాల గ్రామంలో సేకరించిన చెత్తను కృష్ణా నది ఒడ్డున వేస్తున్నారు. నీటి ప్రవాహంలో వ్యర్థాలు కలుస్తున్నాయి. కొన్నిసార్లు చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో పుష్కర ఘాట్ వద్ద స్నానాలకు వచ్చే ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని చెత్త నిల్వకు వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
నది ఒడ్డు.. డంపింగ్ యార్డు


