హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను ఇవాళ్టి నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలు, ట్రాక్‌ల ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే మొత్తం 3,336 మంది యాత్రికులు అమర్‌నాథ్ పవిత్ర గుహను దర్శించుకున్నారు.