KRNL: ఎమ్మిగనూరులో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సంస్కృతి, హక్కులను కాపాడాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన సాధన కమిటి చైర్మన్ కదిరికోట ఆదెన్న, ఉపాధ్యాయులు ఆరెకంటి భాస్కర్ పిలుపునిచ్చారు. ఎరుకల కాలనీని ‘ఏకలవ్య నగర్’గా నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మహిళలను ఘనంగా సన్మానించారు.
వార్తలు
'ఆదివాసీల హక్కులు కాపాడాలని పిలుపు'


