హైదరాబాద్: 28°C
వార్తలు

పెరిగిన పాల ధరలు.. లీటరుకు ఎంతంటే?

మహారాష్ట్రలో గేదె, ఆవు పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ 'మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రాసెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్' నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈనెల 11 నుంచి అమల్లోకి రానున్నాయి. పాల ఉత్పత్తి వ్యయం పెరగడం, పశుగ్రాసం ధరలు అధికమవడం వంటి పలు కారణాల రీత్యా ఈ ధరల సవరణ అనివార్యమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం పడనుంది.