హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీరామ్ సాగర్‌కు కొనసాగుతున్న వరద

JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి 16,493 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 40.3 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నీటిమట్టం 328.63 మీటర్లకు చేరింది. 993 క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా విడుదల చేస్తున్నారు.