హైదరాబాద్: 28°C
వార్తలు

కాలువపై పలకలు లేక.. వాసులకు అవస్ధలు

VZM: రాజాం పట్టణంలోని యాతవీధిలో సుమారు 20 ఏళ్ల క్రితం రహదారి నిర్మించినా, కాలువపై ఇప్పటివరకు సిమెంట్ పలకలు ఏర్పాటు చేయలేదు. దీంతో కాలువ దాటేందుకు పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతూ కిందపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు నిలిచి దోమలు, దుర్వాసనతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.