ASF: వాంకిడి మండలంలోని నవెదరి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ. 2లక్షల నిధులతో మంజూరైన వంట గది నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. గుత్తేదారు పనులను మధ్యలో వదిలేయడంతో ఆరు నెలలుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వార్తలు
వంటగది పూర్తయ్యేదెప్పుడో..?


