WNP: జిల్లా కేంద్రంలో సర్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తహసీల్దార్ రమేశ్ రెడ్డి తెలిపారు. మండలంలో మొత్తం 32,496 మంది ఓటర్లు ఉండగా, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, ఫారాలు తిరిగి సమర్పించని వారిని మినహాయించి 28,864 మంది ఫారాలు అందజేశారని చెప్పారు. వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తయిందని, సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
వార్తలు
'జిల్లాలో సర్వే ప్రక్రియ 100 శాతం పూర్తి'


