హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్

ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు. ఇటీవల నాలుగో సంతానానికి జన్మనిచ్చిన నేపథ్యంలో వాన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.