హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేనలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

WGL: వరంగల్ శివనగర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యడ ప్రభాకర్‌ (కరాటే ప్రభాకర్) జనసేనలో చేరారు. శనివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ప్రభాకర్‌ పనిచేశారు. ఆయన సతీమణి ఉమ వరంగల్‌ డీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.