BHPL: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో భూపాలపల్లికి చెందిన ఇమ్రాన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎంగేజ్‌మెంట్ అనంతరం రూ.3 లక్షలు తీసుకుని, మరో రూ. 3లక్షలు, బైక్ డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. మత పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా పెళ్లికి నిరాకరించడంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
పెళ్లి పేరుతో మోసం.. యువకుడి రిమాండ్


