TG: వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన పెద్ది కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా కలిసి పరామర్శించి ఓదార్చనున్నారు. మరోవైపు నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
వార్తలు
నేడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి KCR


