హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలలో రూమ్‌ల దందా.. నిందితుల అరెస్ట్

AP: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను అక్రమంగా పొందుతూ.. అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు.