హైదరాబాద్: 28°C
వార్తలు

ఈజీ మనీ కోసం చోరీలు..వ్యక్తి అరెస్ట్

PPM: సీతానగరంలో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడు సతీశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 2, 3 తేదీల్లో రెండు ఇళ్లలో 42 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు, బంగారం విక్రయానికి వెళ్తుండగా పట్టుకున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ మాధవ్‌రెడ్డి తెలిపారు.