హైదరాబాద్: 28°C
వార్తలు

మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స

మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స అందించిన ఘటన బీహార్‌లో జరిగింది. ససారంలోని మోడల్ ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో.. మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు వైద్యులు చికిత్స అందించారు. కొన్ని గంటల పాటు ఆసుపత్రికి విద్యుత్ సరఫరా అవ్వకపోవడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విపక్షాలు విమర్శలు గుప్పించాయి.