హైదరాబాద్: 28°C
వార్తలు

దారుణం.. కాంగ్రెస్ నేతను కాల్చి చంపిన దుండగులు

కర్ణాటక ఉడుపిలో దారుణం చోటుచేసుకుంది. చర్చి కాంప్లెక్స్ సమీపంలో కాంగ్రెస్ నేత డేవిడ్ డిసౌజాను గన్‌తో దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు.. డిసౌజాను ఫాలో చేసి, కారు డోర్ తీస్తున్న సమయంలో తలపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కాంగ్రెస్ నేత మృతి చెందారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.