హైదరాబాద్: 28°C
వార్తలు

మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ సిబ్బంది ఆత్మహత్యాయత్నం!

NDL: మిడుతూరులోని ఏపీ మోడల్‌ స్కూల్‌ బాలికల వసతిగృహంలో పనిచేస్తున్న రవణమ్మ గులికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మిడుతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.