VZM: డీఎస్సీలో చోటుచేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న చీపురుపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. శనివారం మాజీ మంత్రి బొత్స క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, విద్యావేత్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
'నెల 10న చీపురుపల్లిలో నిరసన'


