హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే యరపతినేని ఇంటింటి ప్రచారం!

PLD: మాచవరం మండలం గోవిందాపురంలో నిర్వహించిన '2 ఏళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచారంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 90% హామీలు నెరవేర్చామని, CM చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.