హైదరాబాద్: 28°C
వార్తలు

'గట్టు మీద చెట్టు' కార్యక్రమంలో మంత్రి

PPM: కురుపాం రైతులు సంప్రదాయ ధాన్యం పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శనివారం కురుపాం మండలం రంగుపురం పంచాయతీ పరిధిలోని గురుగుబిల్లి గ్రామంలో ‘గట్టు మీద చెట్టు’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు.