హైదరాబాద్: 28°C
వార్తలు

చైనా, అమెరికాలకు పోటీగా భారత్

భారత్ తన వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చైనా, అమెరికాలు 6th జనరేషన్ ఫైటర్ జెట్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ దేశాల సరసన నిలిచేందుకు భారత్ సిద్ధమైంది. ఫ్రాన్స్ సహకారంతో 6th జనరేషన్ ఫైటర్ జెట్లను తయారు చేసేందుకు భారత రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశంతో చర్చలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. త్వరలో వీటి తయారీ ప్రారంభంకానున్నాయి.