హైదరాబాద్: 28°C
వార్తలు

ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్‌లో గురునాయుడు సత్తా

 VZM: ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఏషియన్ జూనియర్ వెయిట్‌ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన గురునాయుడు 60 కేజీల విభాగంలో మూడు సిల్వర్ పతకాలు సాధించాడు. స్నాచ్‌లో 119 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 146 కేజీలు ఎత్తి సత్తా చాటాడు. ఈ విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.