KNR: బొమ్మకల్ గ్రామంలో నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. నగర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని పూజించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
వార్తలు
బొమ్మకల్‌లో బోనాల వేడుకల్లో మేయర్


